ఢిల్లీపై లక్నో గెలుపు..

75
lsg
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్‌పై ఘన విజయం సాధించింది లక్నో. ఢిల్లీ విధించిన 150 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి చేధించి గెలుపొందింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ (24), ఎవిన్ లూయిస్‌ (5), దీపక్‌ హుడా (11) ,కృనాల్ పాండ్య (19), ఆయుష్ బదోనీ (10) రాణించడంతో లక్నో గెలుపు ఖాయమైంది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు,శార్దూల్ ఠాకూర్, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.దీంతో లక్నో జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది.

ఇక అంతకముందు టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా….లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 34 బంతుల్లో 2 సిక్స్‌లు,9 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. పంత్ (36 బంతుల్లో 39 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 పరుగులు) చేయడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

- Advertisement -