ఇమ్రాన్ ఖాన్‌కు షాక్..!

90
imran
- Advertisement -

పాక్ అత్యున్నత న్యాయస్థానం ఇ ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు షాకిచ్చింది. ఇమ్రాన్ స‌ర్కారుపై విప‌క్షాలు ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌రగాల్సిందేన‌ంటూ తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 9న ఓటింగ్ నిర్వహించాలని తేల్చిచెప్పింది. దీంతో ఇమ్రాన్‌ కు షాక్ తగిలినట్లైంది.

ఇమ్రాన్‌పై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా ఆయన సరికొత్త ఎత్తుగడ వేశారు. పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌తో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ర‌ద్దు చేసి ఏకంగా జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేశారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విపక్షాలకు అనుకూలమైన తీర్పు వచ్చింది. డిప్యూటీ స్పీక‌ర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చ‌డం స‌రికాద‌ంటూ వెల్లడించింది సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఇవాళ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్‌ను నిర్వహించనున్న ఇమ్రాన్ ఖాన్ అనంతరం పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

- Advertisement -