స్థిరంగా బంగారం ధరలు…

66
gold

కరోనా లాక్ డౌన్ తర్వాత బంగారం ధరల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపిస్తుండగా తాజాగా ఇవాళ బంగారం ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ.63,300గా ఉంది. పరిశ్రమల యూనిట్లు, నాణెపు తయారీ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది.