నాని 28..అఫీషియల్ అనౌన్స్‌మెంట్

48
nani

లాక్ డౌన్ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు హీరో నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తుండగా దీపావళి విషెస్ చెబుతూ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నవంబర్ 21న రానుందని తెలిపారు.

నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నే ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా చిత్రంలో క‌థానాయిక‌గా మ‌ల‌యాళ బ్యూటీ న‌ర్జియా ఫ‌హ‌ద్ న‌టించ‌నున్న‌ట్టు తెలిపారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాతో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తైన త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు.