ఎస్‌-400కు మార్గం సుగమైంది.

52
caatsa
- Advertisement -

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొన్నందుకు శిక్షగా కాట్సా (CAATSA) చట్టం కింద ఆంక్షలు విధించకుండా భారత్‌కు మినహాయింపు కలిగించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును భారత- అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ప్రవేశ పెట్టగా మూజువాణి ఓటు ద్వారా అగ్రరాజ్య కాంగ్రెస్‌ దిగువ సభ అమోదించింది. రష్యా నుంచి ఆయుధాలను కొనుగొలు చేసేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే కాట్సా ద్వారా ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తోంది. కాగా తాజాగా భారత్‌కు మినహాయింపు ఇవ్వడం వల్ల రష్యా నుంచి ఎస్‌-400 కొనుగోలుకు మార్గం సుగమైంది. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణీ వ్యవస్థను కొన్న టర్కీపై ఇప్పటికే కాట్సాను ప్రయోగించారు.

భారత్‌ ఆయుధ బలగంలో అత్యధికంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఉన్న పళాన రష్యాతో దిల్లీ తెగదెంపులు చేసుకోలేదని రో ఖన్నా ఈ సందర్భంగా వివరించారు. అంతేగాక ప్రస్తుతం భారత్‌కు చైనా నుంచి ముప్పు పెరుగుతోన్నా దృష్ట్యా ఈ కొనుగోలు తప్పనిసరైందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సవరణను దిగువ సభ ఆమోదించగా ఎగువ సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడి ఆమోదంతో భారత్‌కు ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.

- Advertisement -