- Advertisement -
నియోజకవర్గాల పునర్విభజనపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారు అన్నారు.
ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదు అన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయి..ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదు అని కామెంట్ చేశారు.
ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read:హోంశాఖ అంటే ఇష్టం..కోమటిరెడ్డి మనసులో మాట
- Advertisement -

