కేసీఆర్‌ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం : మంత్రి కేటీఆర్‌.

118
ktr
- Advertisement -

వంద శాతం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్‌. సౌత్ ఇండియా లో ఏ నాయకుడు ఇప్పటి వరకు హ్యాట్రిక్ సీఎం కాలేదన్నారు. కాని కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతురాని తెలిపారు. ఒక్కో చోట ఒక్కో పార్టీ మాకు ప్రత్యర్థిగా ఉన్నది… ఏది ఏమైనా మా సర్వేల ప్రకారం 90 సీట్లు వస్తున్నాయన్నారు. రెండు సర్వేల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ప్రత్యర్థులే ఒప్పుకుంటున్నారు. పాలేరులో షర్మిల, ఒక్కో చోట కెఏ పాల్ మా ప్రత్యర్థులు కావొచ్చు కాని 8 ఏళ్ళ టీఆర్‌ఎస్ పాలనను చూసి ప్రజలు మళ్ళీ టిఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో బలమైన నాయకులకే టికెట్ వస్తుందని… వాళ్లే గెలుపు గుర్రాలు అవుతారని తెలిపారు. మంత్రులందరూ బాగా పనిచేస్తున్నారు- నాకంటే బాగా పనిచేస్తున్న మంత్రులూ ఉన్నారు. వాళ్లందరికీ నా శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వాలను కూల్చుతాం- చీల్చుతాం అనే మాటలు అహంకార పూరిత మాటలు అవి బీజేపీ తోనే సాద్యమన్నారు. బీజేపీ 9 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చారని తాజా మహారాష్ట్రలో కూల్చారన్నారు. ఆందోళన్ జీవి అని ప్రధాని పార్లమెంట్ లో అనొచ్చ అని అడిగారు. గాడ్సే దేశ భక్తుడు అని ఒక మంత్రి, ఒక నాయకుడు గోలి మారో సాలోన్కో అని అంటారని ఎద్దేవా చేశారు. జుమ్లా లేదా ఆమ్లా, మోడీ లేదా ఈడీ మాత్రమే బీజేపీకి తెలిసిన విద్యాన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న అన్ని సంస్థలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మరాయన్నారు. ప్రజలు ఎమ్ తినాలో, ఎం తినొద్ధో చేప్పేందుకు బీజేపీ నాయకులు ఎవరని ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉండే ఈ దేశంలో ఏకత్వాన్ని రుద్దడం ఏంటన్నారు. రూపాయి విలువ పడిపోతే దేశ ఆత్మగౌరవం పడిపోతుందని మోడీ ఆనాడు అన్నారుగా…కాని ఈనాడు అదే రూపాయి పడిపోతుందిగా… మోడీ ఆనాడు అన్న మాటలు మళ్ళీ దేశ ప్రజలు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు ప్రజలు గమనిస్తున్నారు! టీఆర్‌ఎస్‌ పుట్టిన కొత్తలోనే మొన్న బీజేపీ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కంటే పెద్దగా పెట్టినం….కేసీఆర్ నాయకత్వం నచ్చిన వాళ్ళు అందరూ మాతోనే ఉంటారు. పక్క పార్టీ బలహీనంగా ఉంది కాబట్టే టీఆర్‌ఎస్‌ నాయకుల వైపు ఆయా పార్టీలు ఎదురు చూస్తున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు 2023లోనే జరుగుతాయన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని…. మాకు ముందస్తుగా వెళ్లాల్సిన అవసరం మాకు లేదన్నారు. వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముందస్తుగా ప్రధాని నిధులు ఇవ్వాలి కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు ఎప్పుడూ సహకరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని శత్రు దేశాలపై పెట్టినట్లు కేంద్రం ఆర్థిక ఆంక్షలు పెడుతోంది. కేంద్రానికి సిగ్గు ఉంటే నరేగా ద్వారా తెలంగాణలో అభివృద్ధి చెందినట్లుగా ఎక్కడైనా జరిగిందిమో నిరూపించాలన్నారు. కేంద్రం అభివృద్ధిలో తెలంగాణ వాటా ఉంది కాని తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర సున్నా కూడా లేదన్నారు. నేను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా మీరు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు.

పల్లే గోసలు తెలంగాణలో ఎక్కడా లేవన్నాయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పల్లె గోసలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె గోసలు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ప్రైవేట్ మీటింగ్ కు వచ్చారు కాని ప్రైవేట్ మీటింగ్ కు వస్తే సీఎం ఎట్లా రిసీవ్ చేసుకుంటారని కేటీఆర్‌ అన్నారు. మోడీ పెరేడ్ గ్రౌండ్ లో చెప్పిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియాలన్నారు. టెక్స్ టైల్స్ పార్కు, కట్టని ఫ్లై ఓవర్ కట్టారని అబద్ధాలు ఆడివెళ్లిపోయారు.

రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే స్వాగతం కాని తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నదో, ఇప్పుడు ఎట్లా ఉన్నదో అనేది రాహుల్ గాంధీ చూడాలన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్ల లో ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలన్నారు. రాహుల్ గాంధీ కి అమేథీ, రేవంత్ రెడ్డి కి కొడంగల్ లో చెల్లని రూపాయిలుగా చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద దెబ్బ తగులబోతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

పేదరికంలో ఇండియా 3వ స్థానంలో ఉందన్నాయన ఇప్పటికీ ఇండియా పేద దేశమేగానే ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన మొదటిరోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు సొంత ఆదాయ వనరులు ఉన్నాయి అదనంగా అభివృద్ధి కోసం రుణాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాపిటల్ ఎక్స్పండేచర్ డబుల్ ఉందన్నారు. తెలంగాణ ఇప్పటి వరకు సర్‌ప్లస్‌ స్టేట్‌గా ఉందన్నారు.

ధరణి పథకం చాలా మంచిదన్నారు. కావాలంటే ధరణికి ముందు- తరువాత రిజిస్టేషన్లు ఎన్ని అయ్యాయో చూడాలన్నారు. పరిపాలనా కేంద్రీకృతముగా ఉంటే అభివృద్ధిలో ముందు ఉండలేమని సీఏం కేసీఆర్‌ దూరదృష్టితో అలోచించి 141 ఉన్న సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీస్ లు ..ఇప్పుడు వాటిని 600లకు పైగా విస్తరించామని తెలిపారు.

ROFR చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్రానికి శిత్తశుద్ధి ఉంటే పోడు భూముల చట్టాన్ని సవరణ చెయ్యాలన్నారు. కేంద్రం చట్ట సవరణ చేస్తే వెంటనే పట్టాలు ఇస్తామని తెలిపారు. కట్ ఆఫ్ డేట్ పెంచి, ROFR చట్టాన్ని సవరణ చేస్తే పోడు భూముల సమస్య వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తే వాళ్ళ చేతులతోనే గిరిజనులకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమి చేయలేకపోతుందన్నారు. ట్రైబల్ హక్కులను కాలరాసే యాక్ట్ లను కేంద్రం తెబోతోందన్నాయన… పార్లమెంట్ లో ఆయాక్ట్ లను టీఆర్‌ఎస్సే అడ్డుకుంటుందన్నారు.

- Advertisement -