44 ఏళ్ల వయసులో సరికొత్త రికార్డు..

252
- Advertisement -

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ 44 ఏళ్ల వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్‌ కప్‌ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గాంగ్‌-జీ జాంగ్‌ జోడీని 5-7, 7-6(5), 7-6(3) తేడాతో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీ ఓడించింది. దీంతో ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా పేస్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు లియాండర్ 43 సార్లు డేవిస్ కప్ డబుల్స్‌లో గెలిచాడు. పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ అనే ప్లేయర్ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు.

Leander Paes becomes most successful player in Davis Cup

1990లో జీషాన్‌ అలీతో కలిసి తొలిసారి ఆడిన లియాండర్‌ పేస్‌ సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.చైనాలో జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉన్నది. 1-2 పాయింట్ల తేడాతో చైనా ముందుకు దూసుకెళ్లుతున్నది. ఈ టోర్నీలో రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉన్నది.

- Advertisement -