నో డైలాగ్స్… ఓన్లీ యాక్షన్…

250
Prabhu Deva in a film without dialogue or Dance
- Advertisement -

ప్రభుదేవా ప్రధాన పాత్రలో చేస్తున్న తాజా చిత్రం మెర్య్కురీ. ఈ చిత్రానికి పిజ్జా, జిగర్తాండ, ఇరైవి వంటి చిత్రాలతో ఆకట్టకున్న యువదర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క డైలాగ్ లు లేకుండా సైలెంట్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అభిమానుల్లో భారీ అంచనాలనే క్రియేట్ చేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండ సినిమా తీయడంతో అభిమానుల్లో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Prabhu Deva in a film without dialogue or Dance

ఈ చిత్రంలో మెర్కురీలో తన పాత్ర భిన్నంగా ఉంటుందన్నారు. ఎప్పడు ఇలాంటి ప్రయోగాలు చేయలేదని తొలిసారి చేస్తున్నామన్నారు. షూటింగ్ సమయంలోనూ ఎలాంటి శబ్దాలు లేకుండా చిత్రీకరించామన్నారు. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే టెన్షన్ మొదలవుతుంది. కానీ మూవీకి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.

కథ, కథనాలపై నాకు చాలా నమ్మకం ఉందన్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. ఈ మూవీని స్టోన్‌బెంచ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పెన్‌ ఇండియా లిమిటెడ్‌ పతాకంపై ‘మెర్క్యురీ’ని నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌, మిథున్‌ శర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రభుదేవాతో పాటు, సనత్‌రెడ్డి, దీపక్‌ పరమేశ్‌, అనీశ్‌ ప్యాడ్‌మ్యాన్‌, రమ్య నంబీశన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -