యజమాని నిర్లక్ష్యం… చిన్నారికి తప్పిన ప్రమాదం…

206
Childrans Plays Glass Door Shatters suddenly smithereens
- Advertisement -

చైనాలో ఓ షాప్ యజమాని నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం మీదికి వచ్చింది. చైనాలోని చెంగ్డూలో ఉన్న ఓ షాపింగ్ మాల్‎లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కొడుకుతో కలిసి మొబైల్ స్టోర్‎కి వెళ్లిందో మహిళ. ఆ మహిళ మొబైల్ సేల్స్‎మెన్‎తో మాట్లాడుతుండగా, తన కొడుకు స్టోర్ బయట ఉన్న గ్లాస్ డోర్‎తో ఆడుకుంటున్నాడు, ఆ బాలుడికి మరో బాలుడు తోడవటంతో ఆ గ్లాస్ డోర్‎ని అటూ ఇటూ ఊపసాగారు. ఇంతలో అయోమయం గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపే గ్లాస్ డోర్ చిన్నాబిన్నం అయ్యింది.

చిన్న పిల్లోడు నెట్టితే గ్లాస్ డోర్ పగులిపోతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనలో బాలుడి ముఖంపై గ్లాస్ ముక్కలు పడటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదు. మరోవైపు ఆ బుడ్డోడి తల్లి మాత్రం ఆ మైబైల్ స్టోర్ యజమాని తనకు 2 లక్షల యువాన్ల నష్టపరిహారం చెలించాలని కోర్టును ఆశ్రయించింది. మొబైల్ స్టోర్ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బాలుడికి ప్రమాదం జరిగినందున నష్టపరిహారం చెల్లించాలంది. ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్‎గా మారింది. మొబైల్ స్టోర్ యాజమాన్యం నిర్లక్యం వల్లే తప్పదం జరిగిందని నెటిజన్లు మొబైల్ షాప్ యజమానిపై మండిపడుతున్నారు.

- Advertisement -