India: ప్రపంచ జనాభాలో మనమే టాప్‌..!

30
- Advertisement -

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మొదటి స్థానంలో ఉన్న చైనా కంటే భారత్ 29లక్షల జనాభాతో ఈ రికార్డును చెరిపి మొదటి స్థానంలోకి చేరిందని తన నివేదికలో వెల్లడించింది. దీనికి సంబంధించిన డేటాను ఐరాస బుధవారం విడుదల చేసింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను వెల్లడించింది.

Also read: అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన హైదరాబాద్‌..

భారత్లో అత్యధికంగా 142.86కోట్ల జనాభా ఉన్నట్లు నిర్ధారించింది. మనతో పొలిస్తే చైనా జనాభా 29లక్షల తక్కువగా ఉందని తెలిపింది. అలాగే ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. మూడవ స్థానంలో అమెరికా 34కోట్లతో ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది. ప్రపంచ జనాభా 804.5కోట్లుగా అంచనా వేయగా అందులో భారత్‌, చైనాల వాటా మూడులో ఒకటో వంతుగా ఉన్నట్టు తెలిపింది.

Also read: TTD:పాతవిధానంలోనే అన్నప్రసాదం

కరోనా కారణంగా చైనాలో జనాభా తగ్గిపోయిందని నిర్ధారించింది. ఇందుకుగాను అక్కడి ప్రభుత్వం చేతులేత్తిసినట్టుగా పేర్కొంది. అయితే భారత్‌లో మాత్రము కొంతమేర తగ్గుదల కనిపించదని వెల్లడించారు. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2శాతం పెరుగుతూ వస్తుండగా… అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7శాతంగా ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -