రివ్యూ : లక్ష్మి

1018
laxmi
- Advertisement -

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ. డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్‌లో లక్ష్మి మూవీని తెరకెక్కించిన రాఘవ ఏ మేరకు మెప్పించారో చూద్దాం..

క‌థ‌:

ఆసిఫ్‌(అక్ష‌య్ కుమార్‌)కి దెయ్యాలు, భూతాలంటే న‌మ్మ‌కాలుండ‌వు. ఓ హిందూ అమ్మాయి ర‌ష్మి(కియ‌రా అద్వాని)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.దాంతో ర‌ష్మి కుటుంబానికి దూరం అవుతుంది. సీన్ కట్ చేస్తే స్ధానికంగా ఉండే ఓ ఖాళీ ప్రాంతాన్ని చూసి స్ధానికులు భయపడుతుంటారు. అయితే అక్కడికి వెళ్లి ఆసిఫ్‌ క్రికెట్ ఆడిన తర్వాత పరిస్ధితులు మారిపోతాయి. అస‌లు అలా ఎందుకు జ‌రుగుతాయి? ల‌క్ష్మి ఎవ‌రు? చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్,మైనస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ అక్షయ్ కుమార్‌,కథ. ట్రాన్స్ జెండర్‌గా అద్భుత నటనతో అదరగొట్టాడు అక్షయ్ కుమార్‌. కియరా అద్వాని అందంగా క‌నిపించగా శ‌ర‌ద్ కేల్‌క‌ర్ , రాజేశ్ శ‌ర్మ‌, దీపక్ పాత్రలో మను రిషి చాధా, అతని భార్యగా అశ్విని కల్సేకర్, రష్మీ తల్లిగా అయేషా వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అయితే సినిమాలో లాజిక్ మిస్ అవడం మైనస్ పాయింట్స్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. నేప‌థ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడిగా రాఘవ లారెన్స్ పర్వాలేదనిపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

బాలీవుడ్ నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేసి మంచి ప్రయత్నం చేశారు దర్శకుడు రాఘవ లారెన్స్‌. స‌మాజంలో ట్రాన్స్‌జెండర్స్ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ చేసినా అక్షయ్ కుమార్ నటన సినిమాకు పెద్ద ప్లస్‌. ఓవరాల్‌గా దివాళికి పక్కా ఎంటర్‌టైనర్‌ లక్ష్మి‌.

విడుదల తేదీ: 10/11/2020
రేటింగ్‌: 2.5/5
న‌టీన‌టులు: అక్ష‌య్ కుమార్‌, కియారా అద్వాని
నిర్మాత‌లు: ఫాక్స్ స్టార్ స్టూడియో, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్‌, స‌బీనా ఎంట‌ర్‌టైన్‌మెంట్, తుషార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హౌస్‌
కెమెరా: వెట్రి ప‌ళ‌ని స్వామి
దర్శ‌క‌త్వం: రాఘ‌వ లారెన్స్‌

- Advertisement -