కరోనాను జయించిన రాజశేఖర్..

45
covid 19

కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు హీరో రాజశేఖర్. సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకున్న రాజశేఖర్‌ ఆరోగ్యం కుదటపడటంతో ఆయనను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. రాజశేఖర్‌ డిశ్చార్జ్‌ సందర్భంగా.. సిటి న్యూరో సెంటర్‌ సిబ్బందికి, డాక్టర్‌ కృష్ణకు జీవితా రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు.

నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవితా రాజశేఖర్ … అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

నాన్న కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాజశేఖర్ కూతురు శివాత్మిక.