చంద్రముఖి 2…ఓటీటీ డేట్ లాక్

35
- Advertisement -

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్యపాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చంద్రముఖి 2’. సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 28న తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో రిలీజ్ అయింది.

ఎవర్‌గ్రీన్‌ లాంటి చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ భారీ అంచనాలుండే..కానీ థియేటర్స్‌కి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది. కథ, కథనం, టేకింగ్‌ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్‌ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి-2 సినిమాను తిప్పి కొట్టారు. అసలు సినిమా రిలీజ్ అయి వచ్చి వెళ్లింది కూడా ఎవరికి తెలియదు.

అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్‌ అయింది. అక్టోబర్ 27 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. చంద్రముఖి సినిమాకున్న క్రేజ్‌తో సీక్వెల్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు డిజిటల్ హక్కులను దక్కించుకుంది. మరి ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి..

Also Read:పిక్ టాక్ : బాబోయ్ ఏంటి ఈ అరాచకం?

- Advertisement -