నవంబర్‌ 9న లాలు విడుదల: తేజస్వి యాదవ్

157
tejaswi
- Advertisement -

బిహార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది మహాకూటమి. ఆ కూటమి సీఎం అభ్యర్ధి తేజస్వి యాదవ్ నేతృత్వంలో విస్తృత ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఐ నేత కన్నయ్య కుమార్, జేఎన్టీయూ నాయకురాలు అశుతోష్ పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇక ఎన్నికల ప్రచారంలో తండ్రిని తలపిస్తూ దూసుకుపోతున్న ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తన తండ్రి జైలు నుండి వచ్చే తేదీని ప్రకటించారు. నవంబర్ 9న లాలు జైలు నుండి విడుదలవుతారని ఆ మర్నాడే నితీశ్‌కు ఫేర్ వెల్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ సమావేశంలో 10 లక్షల ఉద్యోగాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మహాకూటమి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీకి అక్టోబరు 28, నవంబరు 3, నవంబరు 7న మూడు విడతల్లో పోలింగ్ జరగనుండగా ఫలితాలు నవంబరు 10న వెలువడనున్నాయి.

- Advertisement -