అంతర్జాతీయ సరిహద్దులు తెరిచేందుకు భారత్ నిర్ణయం!

214
indian boareders
- Advertisement -

కరోనాతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇక కరోనాను కంట్రోల్ చేసేందుకు అన్ని దేశాలు సరిహద్దులు మూసివేయగా లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ సరిహద్దులను తిరిగి తెరవాలని భారత్ నిర్ణయించింది. విదేశీయులు ఇండియాకు రావచ్చని, అయితే వారు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రావాలే తప్ప, టూరిస్టులుగా మాత్రం ప్రస్తుతానికి అనుమతించబోమని కేంద్ర హోం శాఖ తెలిపింది.

ఓడలను కూడా విదేశీ ప్రయాణాలకు అనుమతిస్తున్నామని, ప్రయాణికులు కోవిడ్ ప్రొటోకాల్స్ నూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది హోం శాఖ.

- Advertisement -