రోడ్లపై గుంతలు కనిపించొద్దు..

204
KTR review meeting on hyderabad roads
KTR review meeting on hyderabad roads
- Advertisement -

రానున్న వర్షాకాలంలో నగరంలోని ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాని మున్సిపల్ శాఖాధికారులను మంత్రి కెటి రామారావు అదేశాలు జారీ చేశారు. జియచ్ యంసి, జలమండలి, జాతీయ రహదారులు, పోలీస్ అధికారులతో ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్ధలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు వర్షా కాల ప్రణాళిక సన్నద్దత పైన మంత్రి ఆరా తీసారు. వర్షకాలం పూర్తయ్యేవరకు జలమండలి, జియచ్ యంసి అధికారులకు సెలవులు రద్దు చేయాలని శాఖాధిపతులకు అదేశాలు జారీ చేశారు. నగరంలోని రోడ్లకు అవసరం అయిన మరమత్తులను వేంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అదేశాల మేరకు వచ్చే మూడు వారాల్లో అన్ని రోడ్లపైన గుంతలు కనిపించకుండా చేయాలన్నారు. ఈ మేరకు అవసరం అయిన అన్ని ఎర్పాట్లు చేసుకోవాలని, అత్యవసరం అయిన చోట్ల వేంటనే పనులు చేపట్టాని ఇంజనీరింగ్ సిబ్బందిని అదేశించారు. ఈమేరకు వివిధ శాఖలు సమన్వయం పనిచేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

DSC_0347

నగర ప్రజలకు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని, అయితే గత వర్షాకాలంలో ప్రజల నుంచి రోడ్ల విషయంలో అనేక పిర్యాదులు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం గత నాలుగు నెలల నుంచే ఉమ్మడి సమన్వయ గ్రూప్ ఎర్పాటు చేసుకుని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో సన్నందంగా ఉండి ఈ వర్షాకాలంలో వచ్చే ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కోవాలని కోరారు. నగర పరిధిలో ఎలాంటి పిర్యాదులకైనా ఇప్పటి ఉన్న వివిధ నంబర్ల స్థానంలో, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ అయిన 100కి ఫోన్ చేసే సౌకర్యాన్ని ఎర్పాటు చేశామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేశామన్నారు.

వర్షంలోనూ రోడ్లకు తక్షణం మరమత్తులు చేసేందుకు వీలు కల్పించే ఎమల్షన్ ను (బిటి రోడ్డు ఉపయోగించే పదార్ధం) సరిపడే పరిమాణంలో సిద్దంగా ఉంచుకోవాలని జోనల్ కమీషనర్లును అదేశించారు. ఇప్పటికే సైకిల్, బైకులపై తిరుగతూ రోడ్ల స్థితిగతుల తెలుసుకుంటున్న కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. నగరంలో నీళ్లు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించామని, వీటిలో చాల వరకు ఇబ్బందులు తలెత్తుకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అధికారులు మంత్రికి తెలిపారు. గత ఎడాది దురదృష్టవశాత్తు మ్యాన్ హోళ్ ప్రమాదాలు జరిగాయని, ఈ సారి ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా అదికారులదే పూర్తి భాద్యత అని మంత్రి హెచ్చరించారు. రోడ్లు, సీవేజీ ఇంజనీరింగ్ మరమత్తుల్లో పాల్గోనే కార్మికులకు చేతి గ్లౌజులు, బూట్ల తదితర రక్షణ పరికారాలను విధిగా అందజేయాలని మంత్రి స్ఫష్టం చేశారు.

DSC_0365

నగరంలోని హోటళ్లుపై జరిగే తనీఖీలు మరింత పారదర్శంకగా నిర్వహించేందుకు GHMC రూపొందించిన ప్రత్యేక మోబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. దీంతోపాటు నగరంలో అమలు అవుతున్న కార్యక్రమాల్లో, పథకాల్లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సీబిలీటీ కింద భాగస్వాములు అవ్వాలనుకునే వారీ సౌకర్యార్ధం రూపోందించిన ప్రత్యేక వెబ్ సైట్ ను మంత్రి అవిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూట్ బాబా ఫసీయుద్దీన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జియచ్ యంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, జలమండలి యండి దాన కిశోర్ తదితర ఉన్నాతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -