జాలీ ఎల్‌ఎల్‌బి 2 రీమేక్‌లో పవన్‌..

256
Pawan Kalyan to RemakeJolly LLB 2
Pawan Kalyan to RemakeJolly LLB 2
- Advertisement -

అక్షయ్ కుమార్ లాయర్ గా కోర్ట్ డ్రామా తో ఏడాది క్రితం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు పొందిన హిందీ సినిమా ”జాలీ ఎల్ ఎల్ బి 2”. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీవల గురు సినిమాను రీమేక్‌ చేసి హిట్ కొట్టిన వెంకటేష్.. లాయర్‌గా ఈ సినిమాలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఇపుడు తాజాగా ఈ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కనిపించబోతున్నట్టు సమాచారం.

హారిక అండ్ హసీని క్రియేషన్స్ వారు ఇటీవల జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకోగా, ఈ చిత్రాన్ని పవన్ తోనే చేయాలని భావిస్తున్నారట. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రం బాలీవుడ్ లో కలెక్షన్ల సునామి సృష్టించింది. వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అదీకాక సామజిక పరమైన అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో పవన్ ఈ మూవీ పై ఫోకస్ పెట్టాడని సమాచారం. చూడాలి మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో. టీవల వేదాళం రీమేక్ తో కాటమరాయుడు అనే చిత్రాన్ని చేసిన పవన్ త్వరలో మరి కొన్ని రీమేక్స్ చేయనున్నట్టు సమాచారం.ఈ క్రమంలో అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

- Advertisement -