- Advertisement -
ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
నా నాయకుడు.. నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందరిని ముందుకు నడిపిస్తారని అన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.
- Advertisement -