- Advertisement -
తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం నెలకొంది. గురువారం సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. లింగయ్య నాయక్ మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం తెలియజేశారు.
- Advertisement -

