అంబేద్క‌ర్ పేరు పెట్టాలి: మంత్రి కేటీఆర్‌

67
ktr
- Advertisement -

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు మంత్రి కేటీఆర్. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న తీర్మానంపై మాట్లాడిన కేటీఆర్…అంబేద్క‌ర్ ల‌క్ష్యం స‌మాన‌త్వం అన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, దాన్ని తానే ముందుగా త‌గుల‌బెడుతాన‌ని అన్నార‌ని గుర్తు చేశారు.

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్..అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌, టెంపుల్ ఆఫ్ డెమాక్ర‌సీకి పేరు పెట్ట‌డానికి ఇంత‌కు మించిన వ్య‌క్తి లేరు కాబ‌ట్టి.. అందుకే అంబేద్క‌ర్ పేరును పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి కేటీఆర్ త‌న తీర్మానంలో కోరారు.

బీజేపీ మిత్రులు కూడా ఈ తీర్మానానికి మ‌ద్ద‌తు తెలిపితే బాగుండేద‌న్నారు. పంజాగుట్టలో విగ్ర‌హం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. 125 అడుగుల విగ్ర‌హాన్ని ఇక్క‌డే, తెలంగాణ ప్ర‌జ‌లు, దేశ ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకునే రీతిలో నిర్మిస్తున్నామ‌న్నారు.

- Advertisement -