అగ్రికల్చర్ బిల్లుపై మంత్రి కేటీఆర్ ట్వీట్

261
Minister ktr
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లుపై ఆసక్తికర ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. రైతు బిల్లు చారిత్రాత్మకమే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

అగ్రిబిల్లును నిరసిస్తూ ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ బిల్లును తీసుకొస్తే రైతులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారని గుర్తుచేసిన కేటీఆర్ తాము ప్రవేశపెట్టింది రైతు స్నేహపూర్వక రెవెన్యూ బిల్లు అన్నారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం లభించే దిశ‌గా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. దీంతో రైతుల నుండి మంచి స్పందన వచ్చింది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

- Advertisement -