తమ్ముడు అప్పుడే పెళ్లి వ‌ద్దురా..!

90
krunal, hardhik pandya

భార‌త క్రికెట్ టీం ఆల్ రౌండ‌ర్ హార్దిక పాండ్యా ఆట‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియా టీం లో విరాట్ కోహ్లి త‌ర్వాత యాక్టివ్ గా ఉండేది అంటే అది హ‌ర్దిక్ పాండ్యానే అని మ‌న‌కు తెలుసు. త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆల్ రౌండ‌ర్ గా జట్టులో స్ధానం సంపాదించుకున్నాడు. హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా కూడా ఇండియా టీంలో మరో ఆల్ రౌండ‌ర్ అన్న విష‌యం తెలిసిందే. క్రికెట్ లో అన్న‌ద‌మ్ములు చాలా మంది ఉడ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

krunal and hardhik

ఇక విరిద్ద‌రూ ఐపిఎల్ లో ముంబై త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యాకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న హార్ధిక్ కు త‌న అన్న కృనాల్ పాండ్యా పెళ్లి విష‌యంపై త‌మ్ముడికి స‌లహాలు ఇచ్చాడు. త‌మ్ముడు తొంద‌ర‌ప‌డి ఇప్పుడే పెళ్లి చేసుకోవ‌ద్ద‌రూ రా అంటూ కృనాల్ స‌ల‌హా ఇచ్చాడు. ఐపిఎల్ టోర్ని ముగిసిన త‌ర్వాత వాట్ ద డ‌క్ -సీజ‌న్ 3 అనే షో లో వీరిద్ద‌రూ పాల్గోన్నారు.

krunal and hardhik

ఈసంద‌ర్భంగా వారి జీవితంలోని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఆ ఇంట‌ర్యూలో తెలిపారు. ఇంట‌ర్యూలో భాగంగా హార్ధిక్ పెళ్లి మ్యాట‌ర్ పై కృనాల్ స‌ల‌హాలు ఇచ్చాడు. నా అనుభ‌వంతో చెబుతున్నా త‌మ్ముడు.. పెళ్లి విష‌యంలో అప్పుడే తొంద‌ర‌ప‌డ‌వ‌ద్ద‌రా..ఇప్పుడే దాని గురించి ఆలోచించ‌కు దానికి ఇంకా చాలా టైం ఉందంటూ చెప్పాడు. 40సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కూ పెళ్లి గురించి ఆలోచించకు..అప్ప‌టి వ‌ర‌కూ వేచి చూడూ..తొంద‌ర‌ప‌డితే నీప‌ని అయిపోయిన‌ట్టే రా త‌మ్ముడు అని కృనాల్ హార్ధిక్ పాండ్యాకు స‌ల‌హా ఇచ్చాడు.