ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి వేముల..

27

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో వినియోగించే స్టోన్, నిర్మాణ డిజైన్లను పరిశీలించేందుకు శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం హస్తినా పర్యటనలో మంత్రి బిజీబిజీగా గడిపారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈ.ఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్,షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ పలువురు అధికారులు ఉన్నారు.

ఈ మేరకు ఈరోజు ఉదయం పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సౌత్, నార్త్ బ్లాక్ నిర్మాణాలను మంత్రి వేముల బృందం పరిశీలించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న వివిధ రకాల రాతి నిర్మాణాలను, ఉపయోగించిన రాతిలోని రకాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పరిశీలించింది. అలాగే పార్లమెంట్ భవనం రెడ్ స్టోన్ ను, సౌత్-నార్త్ బ్లాక్ నిర్మాణంలో ఉపయోగించిన స్టోన్స్ పరిశీలించారు.

పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉన్న వాటర్ ఫౌంటైన్లను బృందం పరిశీలించింది. అనంతరం కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్ అరమనేతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనట్లు తెలుస్తోంది.