కొణిదెల ఫ్యామిలీ టైం..అందమైన ఆదివారం..!

679
konidela family pics
- Advertisement -

మెగా ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్‌ ట్రీట్ ఇచ్చారు కొణిదెల కుటుంబ సభ్యులు. ఆదివారం అంతా ఒక చోట కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి ఆ ఆనందాన్ని ఫ్యాన్స్‌కు పంచారు. అందమైన ఆదివారం అంటూ వర్షం, ఇల్లు, కుటుంబం, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సాయిధరమ్‌ జత చేశారు.

హీరోలు రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు కలిసి ఉన్న ఫొటోను రామ్‌ చరణ్ సతీమణి ఉపాసన సైతం సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. మెగా కుటుంబం ఒక్కచోట ఉన్న ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తుండగా వరుణ్ తేజ్ వాల్మీకి, సాయిధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ తర్వాత తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కల్యాణ్‌దేవ్‌ తన రెండో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే వీరిలో అల్లు ఫ్యామిలీ మిస్సైన ఫ్యాన్స్‌ మాత్రం కొణిదెల హీరోలను చూసి ఖుషీ అవుతున్నారు.

- Advertisement -