ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం:శ్రీనివాస్ గౌడ్

623
srinivas goud
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి తో తెలంగాణ మరింత గొప్ప రాష్ట్రంగా అవతరించనుందని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలుగు రాష్ట్రాల మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభాత సంధ్య కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్‌ – కేరళ భవన్ ఏర్పాటు చేయడం కోసం సీఎం కేసీఆర్ ఒక ఎకరం స్థలం, కోటి రూపాయలను కేటాయించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలను స్వంత రాష్ట్ర ప్రజలు గానే భావిస్తున్నారని చెప్పారు. కేరళ రాష్ట్రం అందమైన రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో గత సంవత్సరం వరదలు వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ 25కోట్లు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు.తాను కమిషనర్ గా ఉన్నప్పుడు కూకట్‌పల్లి లో కేరళ వాసులు నివసించే కాలనీల్లో రోడ్లు వేయడం జరిగిందన్నారు.- స్కూల్ లో కేరళ టీచర్లు అంటే మంచి డిమాండ్ ఉంటుందన్నారు. కొంతమంది కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటారని వాటిని నమ్మకూడదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు మాజీ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి. కేరళ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నే ఉంటుందన్నారు.

- Advertisement -