భారత్ బంగారు కల సాకారం..

206
india

తొలిసారి ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. సాంకేతిక కారణాలతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో రష్యాతో కలిసి భారత్‌ను సంయుక్త విజేతగా ప్రకటించారు. ఫైనల్లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తెలుగు తేజం కోనేరు హంపీ సంయుక్త విజేతగా నిలిచింది.

కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్‌లైన్‌లో టోర్నిని నిర్వహించారు. అయితే ఫైనల్‌లో మ్యాచ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో మ్యాచ్‌ను నిలిపివేసిన నిర్వాహకులు రష్యాను విజేతగా ప్రకటించారు. అయితే దీనిపై భారత ఆటగాళ్లు ఫిర్యాదుచేయడంతో సంయుక్త విజేతలను అనౌన్స్‌చేశారు. భారత్‌ తొలిసారి ఫిడే చెస్‌ ఛాంపియన్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించింది. 2014 లో భారత్‌ క్యాంస్య పతకం సాధించింది

భారత్‌కు ఫిడే ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణం అందించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఈ విజయం ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని ట్వీట్‌ చేశారు. భవిష్యత్‌లో చెస్‌ ఆటగాళ్లు మరిన్ని విజయాలు ఆందుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.