మరింత తగ్గిన బంగారం ధరలు!

64
gold rate

ఆల్ టైం గరిష్ట స్ధాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ.49,120గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గి రూ.53,580కి చేరింది.

పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.66,350కి చేరింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.