జీఎస్టీ పరిహారం చెల్లింపుపై సీఎం కేసీఆర్ రివ్యూ..

129
kcr

జీఎస్టీ పరిహారం చెల్లింపుపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రాల ముందు ప్రభుత్వం ఉంచిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం.ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు మంత్రి హరీష్ రావు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఐజీఎస్టీ మిగులు రూ.1.70లక్షల కోట్లను రాష్ట్రాలను ఏమాత్రం సంప్రదించకుండా కేంద్రం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారంపై రెండు ప్రతిపాదనలు రాష్ట్రాల ముందు ఉంచింది. మొదటి ప్రతిపాదనలో రూ.97వేల కోట్లుగా అంచనా వేయగా.. ఈ మొత్తాన్ని కేంద్రం ఆర్‌బీఐ ద్వారా రుణంగా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తుంది. అసలు, వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది.

రెండో ప్రతిపాదనలో భాగంగా కరోనాతో నష్టపోయిన జీఎస్టీ రూ.2.37లక్షల కోట్ల రుణాల ద్వారా సమకూర్చనుంది. ఇందులో అసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీని రాష్ట్రాలు చెల్లించుకోవాలని చెప్పింది. మొదటి ప్రతిపాదనకు అంగీకరిస్తే రాష్ట్రానికి పరిహారం భారీగా తగ్గనుంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. రెండో ప్రతిపాదనను పరిశీలిస్తే వడ్డీ భారం పడనుంది.