‘‘మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు.
మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్న కోన వెంకట్.. పైవిధంగా స్పందించారు.
అయితే జనవరి 15న ఏం జరగబోతుందన్న ఆసక్తి అందర్లోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అనేది డౌటే. కాగా..ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పడితే అంత మంచిదని భావిస్తున్నాయి.
“SILENCE IS A TRUE FRIEND WHO NEVER BETRAYS”….
I request everyone to maintain Silence till 15th January.. I request even Mahesh Kathi to maintain silence.. going to any media house or using any platform to speak against fans or PK will spoil the attempt to bring peace 🙏— KONA VENKAT (@konavenkat99) January 7, 2018