జిన్నా టైటిల్‌పై కోన వెంకట్ క్లారిటీ!

114
- Advertisement -

మంచు విష్ణు హీరోగా సూర్య దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం జిన్నా. స‌న్నీలియోన్ ఇందులో కీల‌క పాత్ర‌ పోషిస్తుండగా తాజాగా ఈ టైటిల్‌పై వివాదం నెల‌కొంది. దీనిపై రైట‌ర్ కోన వెంక‌ట్ స్పందించారు.

భార‌త‌దేశం మ‌క్క‌ల‌వ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తి పేరును టైటిల్‌గా పెట్ట‌డంతో పాటు.. దాన్ని తిరుప‌తి కొండ‌ల‌పై చూపించ‌టం అనేది వివాదంగా మారింది. ఈ టైటిల్‌ను బీజేపీ త‌ప్పు ప‌డుతోంది. దేశ విభజ‌న‌కు, ఎంతో మంది ఊచ‌కోత‌ల‌కు, చావుల‌కు కార‌ణ‌మైన జిన్నా అనే వ్య‌క్తి పేరుని సినిమా టైటిల్‌గా పెట్ట‌డం సరికాదని విమర్శలు గుప్పించింది.

దీనిపై స్పందించిన కోన వెంకట్‌….త‌మ సినిమా క‌థ‌కు, హీరో క్యారెక్ట‌ర్‌కు, మ‌హ్మ‌ద్ అలీ జిన్నాకు సంబంధం లేద‌ని పేర్కొన్నారు. తిరుప‌తికి చెందిన జి.నాగేశ్వ‌ర‌రావు అనే కుర్రాడి పాత్ర‌లో విష్ణు కనిపిస్తాడని, క‌థ‌లో భాగంగా త‌న‌కు ఆ పేరు న‌చ్చ‌కుండా జిన్నా అనే పేరుగా మార్చుకుంటాడని తెలిపారు. అంతే త‌ప్ప త‌మ సినిమాలో మ‌రో కోణం లేద‌ని ….జిన్నా అలియాస్ జి.నాగేశ్వ‌ర‌రావుగా టైటిల్‌లో యాడ్ చేయిస్తామ‌ని చెప్పారు.

- Advertisement -