రజనీ..ఫస్ట్ లవ్‌ ఫ్లాప్

243
Rajini's first love failed
- Advertisement -

తొలిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన తొలిప్రేమ గురించి మాట్లాడారు. నటచ్చిత్ర విజ్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న రజనీ…అందరిలాగే నాకూ తొలిప్రేమ ఉందని..హైస్కూల్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని తెలిపారు. చాలామంది తొలిప్రేమలో పడతారు..ఓడిపోతారు. నాది కూడా అలాంటి  ఫ్లాప్ లవ్ స్టోరేనని చెప్పుకొచ్చారు. అయితే ఆమె వివరాలు వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు రజనీ.

మీ చిన్న, పెద్ద కోరికలు ఏంటి?అని ప్రశ్నించగా.. ‘ఒక స్కూటర్‌, ఓ చిన్న ఇల్లుకొని మధ్యతరగతి కుటుంబంలా జీవించాలన్నది నా చిన్న కోరిక. నా సినిమాల ద్వారా ప్రజలు, అభిమానులకు మంచి సందేశాలు అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలి అనుకోవడమే నా పెద్ద కోరిక’ అని తలైవా అన్నారు.

రజనీ హీరోగా నటించిన ‘2.ఓ’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయిక పాత్ర పోషించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు అందించారు. ఏప్రిల్‌ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ డిసెంబరు 31 న ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీపెట్టి తమిళనాడులోని 234 స్థానాల్లోనూ పోటీచేస్తానని ప్రకటించి తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

- Advertisement -