“A1 ఎక్స్ ప్రెస్” చూసి గర్వంగా ‌ఫీలయ్యా: కోన వెంకట్

276
kona venkat
- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ‌ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. రిలీజ్ అయిన ప్రతీ చోటా టెర్రిపిక్ రెస్పాన్స్ తో దిగ్విజయంగా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మార్చి 10న సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ సతీమణి వందన, సుప్రియ, చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, నిర్మాత అభిషేక్ అగర్వాల్, సహ నిర్మాతలు దయా పన్నెం, శివ చెర్రీ, కెమెరామన్ కెవిన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. “A1 ఎక్స్ ప్రెస్ తో సందీప్ కిషన్ సక్సెస్ ఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉన్నాం.. అని చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది.. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్.” అన్నారు. పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ సతీమణి వందన మాట్లాడుతూ.. “ముందుగా మా చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఒక మంచి హిట్ సినిమా మా బ్యానర్ కు ఇచ్చారు. సందీప్ కిషన్ చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. ‘A1 ఎక్స్ ప్రెస్’ లాగే అతని కేరియర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

మరో నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ.. “వెంకటాద్రి బ్యానర్లో ఫస్ట్ ‘నిను వీడని నీడను నేనే’ సినిమాని నిర్మించాం. అది మంచి సక్సెస్ అయింది. రెండవ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి అనుకుంటున్న స‌మ‌యంలో తమిళంలో హిట్ అయిన ఈ సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. అప్పుడే మాకు సపోర్ట్ గా పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ తోడ‌వడంతో మాకు మంచి బూస్ట‌ప్‌ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని ఫిక్స్ అయ్యాం. అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసి కరెక్ట్ టైంలో రిలీజ్ చేశాం. ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం. మా బ్యానర్లో రెండవ సినిమా కూడా హిట్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కంటిన్యూగా మంచి సక్సెస్ ఫుల్ మూవీస్ మా బ్యానర్లో చేస్తాం.” అన్నారు.

చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ.. “ఈ సినిమా స్టార్ట్ అయిన ద‌గ్గ‌ర్నుండి మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ తో చేశాం. హాకీ బ్యాక్డ్రాప్ లో తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాం.. అని మాకు నిర్మాతలు బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే యునానిమస్ గా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. నా ఫస్ట్ మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్, నిర్మాతలకు కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన మా యూనిట్ అందరికీ స్పెషల్ థాంక్స్.” అన్నారు. సుప్రియ మాట్లాడుతూ.. “వెంకటాద్రి బ్యానర్లో మేమందరం కలిసి నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. ప్రియదర్శి, రాహుల్ ఎక్స‌లెంట్ గా నటించారు. ఆడియెన్స్ రెస్పాన్స్‌ టెర్రిఫిక్ గా ఉంది. మా చిత్రాన్ని హిట్ చేసిన ఆడియెన్స్ కి థాంక్స్.” అన్నారు.

ప్రముఖ రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. “నేనొక వెయిట్ లిప్టింగ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కరణం మల్లీశ్వరి బయోపిక్ తీస్తున్నాను. ఈ సినిమా నాకొక ధైర్యాన్ని ఇచ్చింది. స్పోర్ట్స్ ఫిలిమ్స్ అంటే అంతగా ఆదరణ లేదు.. అందులో ఎమోషన్ ఉండాలి.. అప్పుడే సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. A1 ఎక్స్ ప్రెస్ లో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ‘బాషా’ లెవెల్ లో అదిరిపోయింది. చాలా మంది అలాగే ఉందని కాల్స్ చేసి చెప్పారు. దర్శి, రాహుల్ ఎమోషన్స్ బాగా పండించారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ ఇది. వాళ్ల‌ కాంబోలో వచ్చే సీన్స్ హార్ట్ టచ్చింగ్ గా అనిపించాయి. ఎలాంటి సినిమాటిక్ స్కేల్స్ లేకుండా ఈ చిత్రాన్ని హానెస్ట్ గా తీశారు. దానికి డైరెక్టర్ జీవన్ ని అభినందిస్తున్నాను. కొన్ని సినిమాలని చూసి బాగుంది అనుకుంటాం. ఇంకొన్ని సినిమాల్ని ఇంటికి తీసుకెళతాం. మరికొన్ని సినిమాల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. A1 అలాంటి సినిమా. ఎమోషనల్‌ సీన్స్ బాగా పండితేనే మనం అనుకున్న సబ్జెక్ట్ ఎలివేట్ అవుతుంది. ఇది ప‌క్కా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. డెన్నిస్ డ‌న్‌ గ్రేట్ వండర్ఫుల్ జాబ్. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా ఇది. వెయిట్ లిఫ్టింగ్‌ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ తీయడానికి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాని నమ్మి, సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కి అభినందనలు. ఒక ప్రేక్షకుడిగా ఇలాంటి మంచి సినిమా చూసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. “సందీప్ కిషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు.. సినిమా తప్ప అతనికి వేరే ఆలోచన లేదు. అలాంటి సినిమా లవర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర్నుండి ఫాలో అవుతున్నాను. టీజర్, ట్రైలర్ చూసి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాను. ఈ సినిమా చూశాక పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, నిర్మాత‌ల‌పై నాకు గౌరవం పెరిగింది. అలాగే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, సందీప్ కి ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని ముందే చెప్పాను. ఇప్పుడు నేను అనుకున్నదే జరిగింది. ఇంత మంచి ఎమోషన్స్ తో హార్ట్ టచ్చింగ్ ఫిల్మ్ చేసిన జీవన్ కి నా అభినందనలు. ప్రతీ ఆర్టిస్ట్ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. రాహుల్, దర్శి సినిమాకి మెయిన్ హైలెట్. ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.” అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ చెర్రీ మాట్లాడుతూ.. “ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇది నా రెండవ సినిమా. ఈ సినిమాని ఇంత మంచి విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్ అన్నకు నా కృతజ్ఞతలు.” అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. “పదేళ్ల క్రితం సందీప్ పరిచయం. అప్పట్నుంచి మా జర్నీ కొనసాగుతోంది. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా థాంక్స్” అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. కథని నమ్మి మేమంతా వర్క చేశాం. ఇవాళ మా నమ్మకం నిజమైంది. ఈ చిత్రం మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఆఫ్ స్క్రీన్ లో కూడా సందీప్ మంచి మిత్రుడు. అదే విషయం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. ఒక మంచి చిత్రంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.” అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “థియేటర్స్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ ఒక ఎనర్జీ, ధైర్యాన్ని ఇచ్చింది. రెగ్యులర్ గా మూవీస్ చేయకూడదు.. విభిన్నమైన పాత్రలు చేయాలి అని.. ఎదురుచూస్తున్న టైంలో తమిళంలో హిట్ అయిన మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. హాకీ బ్యాక్డ్రాప్ లో లవ్, ఎమోషన్స్ తో రూపొందించిన చిత్రం ఇది. ప్రతీ ఒక్కరూ రజినీకాంత్ గారి ‘బాషా’ లెవెల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అందరూ హ్యాపీగా లాభాలతో వున్నాం అని చెప్తున్నారు.. లైఫ్ లాంగ్ ఈ సినిమా నాకు గుర్తుంటుంది. రాహుల్, దర్శి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉంది. అభిషేక్, వివేక్, విశ్వప్రసాద్, దయా అందరం కథని నమ్మి సినిమా చేశాం. జీవన్ ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. ఫ్యూచర్లో గొప్ప దర్శకుడు అవుతాడు. హిప్ హాప్‌ తమిళ వండ‌ర్‌ఫుల్‌ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే కెవిన్ రాజ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కంటెంట్ తో సినిమాలు చేయవచ్చున‌ని నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.” అన్నారు.

- Advertisement -