ఐపీఎల్-11లో అద్భుత ప్రదర్శనతో అందరికంటే ముందు ప్లేఆఫ్ బెర్తు సాధించిన సన్‌రైజర్స్ చివరి దశలో తడబడింది. ప్లేఆఫ్ ముంగిట వరుసగా మూడో పరాజయం చవిచూసింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50; 39 బంతుల్లో 5×4, 1×6) టాప్‌స్కోరర్. ఓ దశలో 200 పరుగులు సాధిస్తుందనుకున్న సన్‌రైజర్స్‌కు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (4/30) అడ్డుకట్ట వేశాడు. కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్రిస్ లిన్ (55; 43 బంతుల్లో 4×4, 3×6), ఉతప్ప (45; 34 బంతుల్లో 3×4, 2×6) చెలరేగి తమ జట్టును ప్లేఆఫ్ చేర్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (ఎల్బీ) (బి) కృష్ణ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సీర్లెస్ 36; పాండే (సి) రింకూసింగ్ (బి) కృష్ణ 25; పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్‌వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకిబ్ (సి) నరైన్ (బి) కృష్ణ 10; రషీద్ (సి) కార్తీక్ (బి) కృష్ణ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172
వికెట్ల పతనం: 1-79, 2-127, 3-141, 4-147, 5-161, 6-168, 7-172, 8-172, 9-172
బౌలింగ్: నితీశ్ రాణా 1-0-5-0; ప్రసిద్ధ్ కృష్ణ 4-0-30-4; రసెల్ 3-0-31-1; సునీల్ నరైన్ 4-0-23-1; పియూష్ చావ్లా 2-0-19-0; కుల్‌దీప్ యాదవ్ 4-0-35-1; సీర్లెస్ 2-0-24-1
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకిబ్ 29; ఉతప్ప (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్‌వైట్ 7; శుభ్‌మన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173
వికెట్ల పతనం: 1-52, 2-119, 3-149, 4-160, 5-172
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-0; సందీప్‌శర్మ 2-0-30-0; కౌల్ 4-0-26-2; షకిబ్ 3-0-30-1; రషీద్ 4-0-31-0; బ్రాత్‌వైట్ 2.4-0-21-2