ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం..!

182
Australia
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఈ రోజు నాలుగో రోజున రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 294 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మార్కస్ 38, వార్నర్ 48, లబుషేన్ 25, స్టీవ్ స్మిత్ 55, మ్యాథ్యూ వేడ్ 0, కెమెరాన్ గ్రీన్ 37, టిమ్ పైనీ 27, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లియాన్ 13, హాజల్ వుడ్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, పాట్ కమిన్స్ 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని, ఆస్ట్రేలియా 327 పరుగులు చేసినట్లయింది. ఇక టీమిండియా బౌలర్లు ఎంతో అద్భుతంగా రాణించారు. మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లను పడగొట్టగా, మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు నాలుగు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ లభించింది.

- Advertisement -