ముగిసిన 3వ రోజు ఆట.. ఆసీస్ 54 పరుగుల ఆధిక్యం..

48
India vs Australia

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరకు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 20 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మార్కస్ హారిస్ 14 బంతులాడి 1 పరుగు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 54 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండడంతో ఫలితం ఆసక్తికరంగా ఉండే అవకాశాలున్నాయి. అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 62/2తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయింది.