పంజాబ్‌పై కోల్‌కతా గెలుపు..ప్లే ఆఫ్ ఆశలు సజీవం

265
shubman gill
- Advertisement -

పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది కోల్‌ కతా. పంజాబ్ విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌,లిన్‌ 6 ఓవర్లలో 62 పరుగులు పరుగులు చేసి మంచి శుభారంభాన్నిందించారు. శుభ్‌మన్‌ చక్కటి షాట్లతో అలరించగా లిన్‌ తన శైలిలో ఎడాపెడా బాదాడు.

శుభ్‌మన్‌ గిల్‌ (65 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 2×6) ,క్రిస్‌ లిన్‌ (46; 22 బంతుల్లో 5×4, 3×6) ,ఉతప్ప (22; 14 బంతుల్లో 2×4, 1×6) ,రసెల్‌ (24; 14 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో కోల్ కతా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మంచి శుభారంభం దక్కలేదు. రాహుల్‌ (2) ,గేల్‌ (14) వెంటవెంటనే వెనుదిరిగారు.మయాంక్‌ అగర్వాల్‌ (36), మన్‌దీప్‌సింగ్‌ (25),సామ్‌ కరన్‌ (55 నాటౌట్‌; 24 బంతుల్లో 7×4, 2×6), నికోలస్‌ పూరన్‌ (48; 27 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది.

కోల్ కతా గెలుపులో కీలక పాత్ర పోషించిన గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మొత్తం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో కోల్ కతా ఐదో స్థానానికి చేరగా ఈ ఓటమితో పంజాబ్‌ (13 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు)తో ఏడో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

- Advertisement -