రేపే తొలి వన్డే.. ఒత్తిడిలో కోహ్లీ !

174
kohli in pressure for WI tour
kohli in pressure for WI tour
- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లే వైదొలగడంతో అనిల్ కుంబ్లేకు మద్దతుగా.. విరాట్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్స్ హోరెత్తుతున్నాయి. లెజెండ‌రీ క్రికెట‌ర్‌ అనిల్ కుంబ్లేను కోహ్లీ అవమానించడంటూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. కుంబ్లే కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో టీమిండియా 17 టెస్టులాడి 12 గెలిచింది. కేవ‌లం ఒక‌దాంట్లోనే ఓడింది. వ‌న్డేల్లోనూ స‌క్సెస్ సాధించింది. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ చేరింది విరాట్ సేన‌. అలాంటి కోచ్‌ను వ‌దులుకోవ‌డం అటు క్రికెట్ ఎక్స్‌ప‌ర్ట్స్‌కే కాదు.. ఇటు ఫ్యాన్స్‌ను కూడా తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్న‌ది.

Indian-cricket-team-captain-Virat-Kohli-L-and-the-newly-appointed-head-coach-Anil-Kumble-leave-the-National-Cricket-Academy-NCA3

మరోవైపు టీమ్‌ఇండియా క్రికెటర్లపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ విరుచుకుపడ్డాడు. ‘‘ఆటగాడిగా కుంబ్లే ఎంతో సాధించాడు. కోచ్‌గానూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం జరుగుతోంది. హెడ్‌ మాస్టర్లా వ్యవహరిస్తున్నాడన్న వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. ఇది సరికాదు. కొత్తగా వచ్చే కోచ్‌కు ఇది చెడు సంకేతాలను పంపిస్తుంది. అయితే ఆటగాళ్లకు లొంగి ఉండు.. లేదా అనిల్‌ కుంబ్లేలా నిష్క్రమించు అన్న చెడు సందేశం వెళుతుంది’’ అని గావస్కర్‌ అన్నాడు. కోచ్‌ కఠినంగానే ఉండాలని, మెతగ్గా వ్యవహరిస్తే మెరుగైన ఫలితాలు రావని అన్నాడు.

స‌రిగ్గా స‌మ‌యం చూసుకొని కుంబ్లే రాజీనామా చేయడంతో.. విరాట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉన్న‌ విరాట్ కోహ్లి తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్లు టీమ్ మేనేజ్‌మెంట్‌లోని అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కోచ్ విష‌యంలో కోహ్లికే వీటో ప‌వ‌ర్ ఇచ్చారు. అది కుంబ్లే రాజీనామాకు దారి తీసింది. ఇప్పుడు కెప్టెన్‌గా అత‌ను క‌చ్చితంగా మంచి ఫ‌లితాలు సాధించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇదే విరాట్‌పై ఒత్తిడి పెంచుతున్న‌దని ఆ అధికారి తెలిపారు. అయితే ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కుంబ్లే, కోహ్లీల మధ్య విభేదాలను బీసీసీఐ పరిష్కరించలేకపోయిందని బోర్డు సీనియర్‌ అధికారి రాజీవ్‌ శుక్లా అన్నాడు.వచ్చే నెల భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడానికి ముందే కొత్త కోచ్‌ను నియమిస్తామని చెప్పాడు. ఇక విండీస్‌లో భారత్‌ ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. తొలి వన్డే శుక్రవారం జరుగుతుంది.

Kohli

- Advertisement -