కేరళలో ఏడాది లాక్ డౌన్‌..!

52
kerala

కరోనా కట్టడిలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏడాదిపాటు లాక్ డౌన్‌ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్తమార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం.

మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పనిసరి చేసింది. వివాహాలకు గరిష్టంగా 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్షలు విధించ‌నున్న‌ట్లు తెలిపింది

ఇక పనిప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య క‌చ్చితంగా ఆరు అడుగుల దూరం పాటించాలని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న‌ది. వచ్చే ఏడాదిపాటు ఈ నిబంధనలు పాటించాల‌ని స్పష్టం చేసింది.