తెలంగాణలో 24 వేలకు చేరువలో కరోనా కేసులు…

199
india coronavirus cases
- Advertisement -

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆదివారం కొత్తగా 1590 కరోనా కేసులు రికార్డుకాగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 23,902 పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రస్తుతం 10904 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 12703 కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనాతో 295 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా చూస్తే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ 19,నల్లగొండ 14, కరీంనగర్‌, వనపర్తి 4, మెదక్‌, నిజామాబాద్‌ 3, నిర్మల్‌, వికారాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం, జనగామ 2 చొప్పున, జోగుళాంబగద్వాల,రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌రూరల్‌, నారాయణపేట, పెద్దపల్లి, యాదాద్రిభువనగిరి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 1 కేసు నమోదయ్యా యి.

మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం 13-60 ఏండ్ల మధ్య వారే ఉన్నారు. 12 ఏండ్ల లోపువారు 1,184 మంది, 60 ఏండ్లు పైబడిన వారు 2,627 మంది ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది

- Advertisement -