ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా:డీజీపీ సవాంగ్

71
ap dgp

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా సోకినట్లు వెల్లడలించారు డీజీపీ గౌతమ్ సవాంగ్.

విశాఖలో మీడియాతో మాట్లాడిన సవాంగ్….లాక్ డౌన్ నిబంధనలు సడలించిన జూన్‌ నుంచి కరోనా కేసులు భారీగా పెరిగాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా కట్టడిలో ఏపీ మరింత అప్రమత్తంగా ఉందని కరోనా కట్టడిని ఏపీ పోలీస్‌ శాఖ చాలెంజింగ్‌గా తీసుకుందని తెలిపారు.

కరోనా కష్టకాలంలోనూ పోలీసులు అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని కొనియాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతగానో కృషి చేశారని చెప్పారు.