కేరళ సీఎం‌కు కరోనా పాజిటివ్..

31
Kerala CM

దేశంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కూడా వేగంగానే జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పలువురు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇయన కొద్దిరోజుల క్రితమే కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హోమ్ క్వారన్ టైన్‌లో ఉన్నారు.

త్వరలోనే విజయన్ కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. కాగా,ఈ నెల 6వ తేదీన ఆయన కుమార్తెకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.