కరోనా నుంచి కోలుకున్న సచిన్..

28
sachin-tendulkar

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుండి బయటపడ్డా..మరికొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండనున్నారు సచిన్. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు. ఆసుపత్రి నుంచి ఇప్పుడే ఇంటికి చేరుకున్నానని, కోలుకునే క్రమంలో మరికొన్నిరోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని సచిన్ తెలిపారు.

తనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధ చూపించారని, ఎంతో మెరుగైన సేవలు అందించారని సచిన్ కొనియాడారు. గత ఏడాది కాలంగా కరోనా చికిత్సలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారని కీర్తించారు. కాగా, సచిన్‌కు మార్చి 27న కరోనా పాజిటివ్ అని వెల్లడైన విషయం తెలిసిందే.