ఫెడరల్ పుష్…జగన్ ప్రమాణస్వీకారోత్సమే వేదిక..!

185
federal front

దేశలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ముమ్మరం చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తాజాగా కేరళ,తమిళనాడు,కర్నాటకలో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న,అధికారంలోకి రాబోతున్న పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని భావిస్తున్నారట కేసీఆర్. దీని వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఎన్నికల ముందు తాను చెప్పినట్లుగా చంద్రబాబు ఓటమితో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది సేమ్ టైమ్ ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటును జగన్ ప్రమాణ స్వీకార వేదికపై నుండి ప్రకటించే ఆలోచనలో ఉన్నారట.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించే ప్రాంతీయ పార్టీల అధినేతలను జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించి జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేలా వ్యూహారచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేరళ సీఎంతో భేటీ అయిన కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి కమ్యూనిస్టులను కూడా భాగస్వాములు అయ్యేలా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

దక్షిణాది సహా ఢిల్లీ,ఒడిశా,యూపీ,బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తాచాటనుండటంతో వారితో కూడా కేసీఆర్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జగన్ ప్రమాణస్వీకారమే వేదిక కానుంది.