కరుణానిధికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

228
kcr

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న కేసీఆర్ రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి .. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్టాలిన్, కనిమొళి తదితర కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

భారత రాజకీయాల్లో ఆయన మరణం తీరని లోటని అన్నారు కేసీఆర్. తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచారని.., భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా సేవలందించారని కొనియాడారు. సామాన్య జనాలకు రాజకీయ చైతన్యం కలిగించిన అతి కొద్ది మందిలో కరుణానిధి ఒకరని కొనియాడారు.

కరుణానిధి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఎంపీ కవిత తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు కవిత. కరుణానిధిని కడసారి చూసేందుకు సినీ,రాజకీయ ప్రముఖులు చెన్నైకి చేరుకుంటున్నారు. సాయంత్రం మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.