రియల్‌ హీరో కోసం రీల్‌ హీరోల క్యూ…

270
kamal rajani
- Advertisement -

రాజకీయ దురంధరుడు,ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారి హీరో కరుణానిధి ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆయన్ని కడసారి చూసేందుకు సినీ,రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు రాజాజీ హాల్‌కు క్యూ కడుతున్నారు. ఆయన మరణాన్ని డీఎంకే శ్రేణులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాయి. తమిళ సినీ పరిశ్రమ సైతం తమ రచయిత కడసారి చూపు కోసం కదిలింది.

రియల్ హీరోకు నివాళులు అర్పించి ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు పలువురు నటులు. రజనీకాంత్‌, కమల్ హాసన్,ధనుష్, విజయ్, అజిత్, శివకార్తికేయన్, నాజర్, ప్రభు, సత్యరాజ్, సూర్య, విజయ్ సేతుపతి, వడివేలు వంటి స్టార్ నటులు కరుణ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.

dhanush rajani

కరుణానిధి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కమలహాసన్. కజగంను ముందుకు తీసుకెళ్లడంలో, దాన్ని పరిరక్షించడంలో అన్నాదురైకి తోడుగా ఇద్దరు సోదరులు కరుణానిధి, ఎంజీఆర్ ఉండేవారని… ఇప్పుడు వారి ముగ్గురిని ఒకే చోట చూడటం బాగుందన్నారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

- Advertisement -