కేసీఆర్… సెప్టెంబర్ సెంటిమెంట్

234
KCR creates history again
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ప్రతిపక్షాలు ఉహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్…105 మందితో ఫస్ట్ లిస్ట్‌ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం,ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా కేసీఆర్ వేద, వాస్తు పండితుల సలహాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.

తాజాగా అసెంబ్లీ రద్దు సమయంలో కూడా సీఎం ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అయ్యారు. ప్రగతి భవన్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ కవిత మంగళహారతితో బొట్టుపెట్టగా వేదపండితులు ప్రత్యేక ఆశీర్వాదం,ప్రత్యేక పూజలతో కేసీఆర్ ముందుకు కదిలారు.

అంతేగాదు కేసీఆర్ కు సెప్టెంబర్ అంటే బాగా కలిసొచ్చే నెల. 2001 సెప్టెంబర్ 22 న ఆయన సిద్ధిపేట లో రాజీనామా చేసి…తర్వాత టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2006లో సెప్టెంబర్ 12న కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా తొమ్మిది నెలల ప్రభుత్వ పదవీ కాలం వదులుకుని అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

గురువారం 6వ తేదీ ఏకాదశి కూడా. హిందు ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి రోజున పూజలు చేస్తే.. అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. అందుకే ఏకాదశి రోజునే అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు గులాబీ బాస్.

కేసీఆర్‌ లక్కీ నంబర్ 6. ఆయన వాహనం నంబర్, సెల్ ఫోన్ నంబర్ అన్నీ ‘ఆరు’తో మమేకమై ఉంటాయి. రాజకీయంగా కేసీఆర్ వేసిన, వేసే ప్రతి అడుగూ 6తోనే ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కోసం కీలక సభలు నిర్వహించినా, ఢిల్లీలో కీలక భేటీలు నిర్వహించినా, దీక్షలకు దిగినా, పదవులకు రాజీనామాలు చేసినా.. అన్నీ 6కు సరితూగేలా ఉంటాయి.

- Advertisement -