కేసీఆర్ దూకుడు..ప్రగతి భవన్‌ నుంచి ప్రజల మధ్యకు

282
kcr
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ రద్దు,105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్ విపక్షాలకు ఉహించని షాకిచ్చారు. తాజాగా కేసీఆర్‌కు అచ్చొచ్చిన హుస్నాబాద్‌ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికపై వందమంది కూర్చునేలా వేదికను నిర్మించారు.

అసెంబ్లీ రద్దయ్యాక జరిగే తొలిసభ కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు సభ ప్రారంభం కానుంది. 2004లోనూ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్‌ నుండే ప్రారంభించి రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగురవేశారు. తాజాగా అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు కేసీఆర్.

సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి హరీష్. సభా ప్రాంగాణానికి వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు హరీష్. సభకు దాదాపుగా లక్షమందిని తరలిరానున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. సభాప్రాంగణంతోపాటు పట్టణంలోని పలు వీధుల్లో కూడా సీఎం ప్రసంగం వినిపించేలా మైకులు ఏర్పాటుచేశారు.

సభకు వచ్చే వారికి పార్కింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాల కోసం తిరుమల గార్డెన్ వద్ద, హన్మకొండ వైపునుంచి వచ్చే వాటికి మార్కెట్‌యార్డులో, కరీంనగర్ వైపునుంచి వచ్చే వాహనాలకు చిల్లింగ్ సెంటర్ వద్ద, అక్కన్నపేట నుంచి వచ్చే వాటికి స్తూపం వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు.

- Advertisement -