వేసవిలో ఇవి తింటే ఎంతో మేలు..!

194

స‌గ్గుబియ్యం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం ఇది. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కృత్రిమ తీపి పదార్ధాలు అలాగే రసాయనాలు లేకపొవడం వల్ల సగ్గు బియ్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఇందులో ఉన్నందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇక ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ప‌దార్థాలలో ఇదీ ఒకటి. స‌గ్గుబియ్యంలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల పోషకాలు ఉంటాయి. అవ‌న్నీ వేస‌విలో మ‌న‌ల్ని ఎండ నుంచి ర‌క్షిస్తాయి. ఈ సగ్గుబియ్యం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..!

Health Benefits of Sago

1. వేసవిలో కొంచెం ప‌నిచేసినా మ‌నం త్వ‌ర‌గా అల‌సిపోతాం. క‌నుక శ‌రీరంలో శ‌క్తి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అలాంటి వారు స‌గ్గు బియ్యం తింటే వెంట‌నే కోల్పోయిన శ‌క్తి తిరిగి వ‌స్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎంత సేపు ప‌ని చేసినా త్వ‌ర‌గా అల‌సిపోరు. నీర‌సం ఉండ‌దు.

2. విరేచ‌నాలు అయిన వారు స‌గ్గుబియ్యం తింటే ఫ‌లితం ఉంటుంది.

3. స‌గ్గుబియ్యంలో పాలు, చ‌క్కెర పోసి వండుకుని తిన్నా లేదంటే.. ఉప్మా త‌ర‌హాలో స‌గ్గుబియ్యం తిన్నా శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు స‌గ్గుబియ్యం తింటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

4. స‌గ్గుబియ్యం తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

5. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌గ్గుబియ్యం తింటే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. చిన్న పిల్లలకు పాలు లేని సమయంలో సగ్గుబియ్యం తినిపించవచ్చు.