శ్రీశైలంలో ఆధ్యాత్మిక శోభ..

139
karthika masam

శ్రీశైలం ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముత్తైదువలు మహిళలు భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మొక్కలు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసం సోమవారం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కావటంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటేత్తారు వేకువజామున నుంచి పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలాచరించి గంగమ్మ ఒడిలొ కార్తీక దీపాలను వదులుతూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరగటంతో దేవస్థానం అధికారులు అన్ని ఆర్జిత కుంకుమార్చన అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటలు సమయం పడుతుంది క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు అల్పాహారం పులిహోర మంచినీరు పాలు బిస్కట్లు అందిస్తూ అధికారులు భక్తుల సేవలొ నిమగ్నమైయ్యారు.

SRISAILAM

శ్రీశైలం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరికి స్వామి అమ్మవారి దర్శనం అందే విదంగా తగిన ఏర్పాట్లు చేశారు. నాగులకట్ట వద్ద భక్తులు అధికసంఖ్యలో మొక్కలు తీర్చుకుంటూ కార్తీక దీపాలను వెలిగించి శ్రీ బ్రమరాంబా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని కార్తీకమాసపూజలు నిర్వహిస్తున్నారు శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది.